వల్లబాయ్ పటేల్ వారోత్సవాలు: బోధన్ లో యూనిటీ మార్చ్ నిర్వహణ

0చూసినవారు
వల్లబాయ్ పటేల్ వారోత్సవాలు: బోధన్ లో యూనిటీ మార్చ్ నిర్వహణ
బోధన్ పట్టణంలో సోమవారం సర్దార్ వల్లబాయ్ పటేల్ 150వ వారోత్సవాలలో భాగంగా, ఏక చక్ర సేవా సమితి, ఆదర్శ్ యువతి మండలి ఆధ్వర్యంలో 'ఆత్మ నిర్భర భారత్' స్ఫూర్తితో యూనిటీ మార్చ్ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో, దేశానికి సర్దార్ వల్లబాయ్ పటేల్ చేసిన సేవలను పలువురు వక్తలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిణి శైలి బెలాల్, విద్యా వికాస్ జూనియర్ కళాశాల డైరెక్టర్ యార్లగడ్డ శ్రీనివాస్ రావు, అంకు మహేష్, చిదుర ప్రదీప్ గుప్తా, పద్మా సింగ్, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you