సాలూరు మండలం జాడీ జమాల్పూర్ గ్రామంలో నూతన 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించి స్విచ్ యాడ్ మార్కింగ్ పనులు గురువారం నిర్వహించారు. ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) స్వామి పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టారు. ఈ సబ్‌స్టేషన్ పూర్తయితే ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఈలు, ఏఈలు, గ్రామస్తులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.