మోస్రా మండలకేంద్రానికి చెందిన ప్రసాద్ (25) అనే యువకుడు ముత్తకుంట శివారులోని నిజాంసాగర్ కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. బెల్టు షాపు వివాదం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.