హిందీ వ్యాసరచన పోటీలో కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల టాపర్ గా కాటేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని తభుసుం ప్రథమ స్థానం సాధించారు. బుధవారం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ విద్యార్థినిని, ఉపాధ్యాయినిని శాలువాతో సన్మానించి అభినందిస్తూ ప్రోత్సాహక బహుమతిగా 1100 రూపాయలు అందించారు. అదేవిధంగా పదవ తరగతిలో కాటేపల్లి గ్రామ విద్యార్థి మండల టాపర్ గా నిలిస్తే 21, 000 రూపాయలు, పాఠశాల టాపర్ గా నిలిస్తే 11, 000 రూపాయలు, నవోదయలో సీటు సాధించిన విద్యార్థికి 1, 500 రూపాయలు ప్రోత్సాహక బహుమతిగా అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయ బృందం,
విద్యార్థులు ఉన్నారు.