జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సోమవారం బెంగళూరులోని విధానసౌధలో కర్ణాటక శాసనసభ స్పీకర్ జి. ఎస్. పాటిల్ (గురుపాదగౌడ పాటిల్), కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేలను మర్యాదపూర్వకంగా కలిశారు.
వారి ఛాంబర్లలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా స్పీకర్, మంత్రిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.