పాలగుండం వద్ద పిచ్చి కుక్కల దాడి: 2 మేకల మృతి, ప్రజల్లో భయాందోళన

1001చూసినవారు
పాలగుండం వద్ద పిచ్చి కుక్కల దాడి: 2 మేకల మృతి, ప్రజల్లో భయాందోళన
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని పాలగుండం వద్ద 9 పిచ్చి కుక్కలు మేకలపై దాడి చేసి, 2 మేకలను చంపేశాయి. మేకల కాపరులపై కూడా ఈ కుక్కలు దాడి చేశాయి. వాహనదారులు, పిల్లలు భయంతో ప్రయాణిస్తున్నారని, ఈ సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన మేకల యజమానులకు నష్టపరిహారం అందించాలని, కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్