హైవేపై కోతులు.. కారు-లారీ ఢీ, పెను ప్రమాదం తప్పింది

557చూసినవారు
నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లి వద్ద జాతీయ రహదారి 161పై సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ, కారు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా కారు ముందుకు కోతులు రావడంతో డ్రైవర్ వాహనాన్ని సైడ్ తిప్పాడు. ఈ క్రమంలో కారు-లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు.