పిట్లం: బైక్ అదుపుతప్పి యువకుడి దుర్మరణం

1120చూసినవారు
పిట్లం: బైక్ అదుపుతప్పి యువకుడి దుర్మరణం
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో రోడ్డు ప్రమాదంలో కోమంచ శ్రీకాంత్ (30) అనే యువకుడు మృతి చెందాడు. మే 3న ఉదయం పని నిమిత్తం పెద్ద కొడప్గల్ వెళ్లిన శ్రీకాంత్, మధ్యాహ్నం తిరిగి వస్తుండగా చిన్న కొడప్గల్ సబ్‌స్టేషన్ సమీపంలో బైక్ అదుపుతప్పి సూచిక బోర్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన శ్రీకాంత్, చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం నిజామాబాద్ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్