
యూపీలో భార్య మరణం తట్టుకేలోక భర్త కన్నుమూత
యూపీలోని అమేథి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. 8 నెలల గర్భవతి అయిన జ్యోతికి ప్రసవ సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాయ్‌బరేలి ఎయిమ్స్‌కు రిఫర్ చేయగా, అక్కడ ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. భార్య మరణ వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన భర్త ఆకాష్, ఆమె లేకుండా జీవించలేనని విలపిస్తూ కొద్ది గంటల్లోనే ఇంట్లోనే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.




