కామారెడ్డి: గంజాయి పట్టివేత.. తొమ్మిది మంది అరెస్టు

509చూసినవారు
కామారెడ్డి: గంజాయి పట్టివేత.. తొమ్మిది మంది అరెస్టు
మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు కామారెడ్డి జిల్లా ఇల్చిపూర్ శివారులోని విఐపి వెంచర్ వద్ద దాడి నిర్వహించి, 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రెండు బైకులు, 8 మొబైల్స్, రూ.3 వేల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని అంచనా. నిందితులు మహారాష్ట్ర నుంచి గంజాయి తెప్పించి కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్