కామారెడ్డి పట్టణంలోని సైలాన్ బాబా కాలనీలో మంగళవారం ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో, దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి 7 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలను అపహరించారు. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ను కూడా తెరిచి వెళ్లారని బాధితుడు వాపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, వేలిముద్రలు సేకరించి, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.