కామారెడ్డి: లారీ ఢీకొని యువకుని మృతి: మరొకరికి గాయాలు

83చూసినవారు
కామారెడ్డి: లారీ ఢీకొని యువకుని మృతి: మరొకరికి గాయాలు
కామారెడ్డి సెగ్మెంట్ దేవునిపల్లి పీఎస్ పరిధిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట్ మండలం నాగంపేట వినోద్ కుమార్ (30), అతని స్నేహితుడు దేవేందర్ (30)కామారెడ్డికి ద్విచక్రవాహనంపై వస్తుండగా, ఉగ్రవాయి మైసమ్మ వద్ద లారీ ఢీకొట్టింది. వారిని ఆసుపత్రికి తరలించగ, వినోద్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్