ఎల్లారెడ్డిపేటలో కారు బైక్ ఢీ: యువకుడికి తీవ్ర గాయాలు

6చూసినవారు
ఎల్లారెడ్డిపేటలో కారు బైక్ ఢీ: యువకుడికి తీవ్ర గాయాలు
ఎల్లారెడ్డిపేట మండలంలోని రగట్లపల్లి, పదిర గ్రామాల మధ్య శనివారం కారు, బైక్ ఢీకొన్న సంఘటనలో వీర్నపల్లి మండలానికి చెందిన భూక్య శ్రీనివాస్ (20) అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. సిరిసిల్ల నుండి ఎల్లారెడ్డిపేటకు వస్తున్న శ్రీనివాస్ బైక్‌ను, కామారెడ్డి నుండి సిరిసిల్లకు వస్తున్న వ్యాపారి కారు రాగట్లపల్లి మూల మలుపు వద్ద ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన శ్రీనివాస్‌ను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్