కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదేశానుసారం బిబిపేట గ్రామంలో నిజ్జని రాధ (ఆటో రవి భార్య) కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నాయకులు శుక్రవారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాత రాజు, ఉపసర్పంచ్ చందుపట్ల ప్రశాంత్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు సుతారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.