లారీ ఢీకొని వంట మాస్టర్ మృతి

1447చూసినవారు
లారీ ఢీకొని వంట మాస్టర్ మృతి
భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో, బస్వాపూర్ గ్రామానికి చెందిన గడ్డమీది చంద్రం (43) అనే వంట మాస్టర్ ఆదివారం రాత్రి తన వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, రోడ్డు దాటుతున్న సమయంలో కామారెడ్డి వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రం, అంబులెన్స్‌లో జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స పొందుతూ మృతి చెందారని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ ఘటన భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్