డైరీ కాలేజ్ సందర్శించిన కౌన్సిలర్ హర్షిత

0చూసినవారు
డైరీ కాలేజ్ సందర్శించిన కౌన్సిలర్ హర్షిత
కామారెడ్డి పట్టణం 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత, కామారెడ్డి జిల్లాలోని డైరీ టెక్నాలజీ కళాశాలను సందర్శించారు. దొడ్ల డైరీ హైద్రాబాద్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధుల కింద రూ. 4 కోట్ల వ్యయంతో చేపట్టిన కళాశాల మొదటి అంతస్తు భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. డైరీ కళాశాలలోని ఇంజనీరింగ్, డైరీ ల్యాబ్‌లను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. డైరీ టెక్నాలజీ ద్వారా దేశవిదేశాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. పీజీ డైరీ కోర్సు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్