తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం దొడ్డి కొమరయ్య

2చూసినవారు
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్యను తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపంగా కొనియాడారు. శనివారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన ధీరుడని, ఆయన స్ఫూర్తి గాథను భావితరాలకు తెలియజేయాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ విక్టర్, అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్