మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు మృతి చెందారు. మృతులు పూసల బాలరాజు, పూసల మంజులగా గుర్తించారు. అవుసులపల్లి వెళ్తుండగా, రామాయంపేట - అక్కన్నపేట గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను ఆటో బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.