పిట్లంలోని యశోద దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాంట్రపల్లి సాయిలు (68) అనే వృద్ధుడు మృతి చెందాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సాయిలును బుధవారం ఉదయం కుమారుడు రాజుతో కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లగా, డాక్టర్ శంకర్ రెండు ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇంజెక్షన్లు ఇచ్చిన కొద్దిసేపటికే సాయిలు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ల వల్లే మృతి చెందాడని కుమారుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలనున్నాయి.