కామారెడ్డి జిల్లా బైరాపూర్లో నీటి పారుదల శాఖ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బైరాపురం గ్రామానికి చెందిన పందుల సాయిలు (48) నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటర్ 20 నెంబర్ కాలువపై లష్కర్గా గత మూడేళ్ల నుంచి పని చేస్తున్నారు. గది కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. 3 రోజుల నుంచి నొప్పి తీవ్రం కావడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయిలు భార్య సైతం మూడేళ్ల కిందట ఆత్మహత్య చేసుకుంది. దీంతో అతడి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు.