కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులో కూలీ పనికి వచ్చిన నర్సాపురం శ్యామల (40) కనిపించకుండా పోయి, కుళ్లిపోయిన స్థితిలో విగతజీవిగా లభ్యమైంది. ఆదివారం భర్త రాజంతో కలిసి పనికి వచ్చిన శ్యామలకు పని దొరకకపోవడంతో ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిపోయింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రైల్వే ట్రాక్ పక్కన కుళ్లిపోయిన మృతదేహం కనిపించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైందా లేక ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. పోస్టుమార్టం, పంచనామా అనంతరం పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.