కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం భవానిపేట్ శింగాయ్ చెరువులో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. భవానీపేట్, మంబోజిపేట్ గ్రామాల మధ్య ఉన్న చెరువులో మహిళ మృతదేహాన్ని స్థానికులు గురువారం ఉదయం గుర్తించారు. మహిళ ఒంటిపై ఎర్రచీర, మెడలో బంగారం ఉందన్నారు. పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించడంతో దర్యాప్తు చేపట్టారు.