కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని పోస్టాఫీస్‌లో ఉద్యోగుల సమయపాలన లోపించడం, విధుల పట్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఉదయం 10.45 గంటలకు ఒక్క ఉద్యోగి మాత్రమే విధులకు హాజరైనట్లు సమాచారం. ప్రభుత్వ సేవలు పొందేందుకు వచ్చే సామాన్య ప్రజలకు ఇలా ఇబ్బందులు కలగడం బాధాకరమని ప్రజలు వాపోతున్నారు.