భిక్కనూర్ జాతీయ రహదారి 44 పై లారీ దగ్ధం

47చూసినవారు
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం సిద్ధి రామేశ్వర్ నగర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి 44వ జాతీయ రహదారిపై నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. అదృష్టవశాత్తు డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించిపోయింది, ప్రయాణికులు కొంతసేపు భయాందోళనకు గురయ్యారు.