బీర్కూర్ లో పిచ్చికుక్క దాడి.. ముగ్గురు విద్యార్థులకు గాయాలు

0చూసినవారు
బీర్కూర్ లో పిచ్చికుక్క దాడి.. ముగ్గురు విద్యార్థులకు గాయాలు
మంగళవారం బీర్కూర్ లో పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి, వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ సర్కారు దవాఖానాకు తరలించినట్లు కుటుంబీకులు, స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్