అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

7చూసినవారు
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
పాల్వంచ మండలం ఫర్దిపేట గ్రామానికి చెందిన కమ్మరి కుమారస్వామి (45) అనే చిరు వ్యాపారి లక్షల్లో అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం మిరపకాయల వ్యాపారం ప్రారంభించిన ఆయన, ఇటీవల ప్రమాదంలో కాలు చేయి విరిగిపోవడంతో చికిత్సకు అప్పులు చేశాడు. వ్యాపారం జీవనోపాధికి మాత్రమే సరిపోతుండటంతో, అప్పులు తీరవని కలత చెంది శనివారం ఉదయం ఇంట్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్