రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ సమీపంలో చోటుచేసుకుంది. బిక్నూర్ మండలం అంతంపల్లికి చెందిన జీడి సిద్దయ్య ఆదివారం రాత్రి హైదరాబాద్లోని తన సోదరుడి ఇంటికి రైలులో వెళ్లాడు. రైలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.