కామారెడ్డి: మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

71చూసినవారు
పిట్లం మండలం చిన్నకొడద్గల్ జీపీ సెక్రటరీ కృష్ణ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. చిన్నకొడప్గల్‌కు చెందిన సుజాతకు కృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. గుర్తించిన భర్త మల్కన్న బాలరాజ్, మల్కయ్యతో కలిసి కృష్ణను హత్య చేశారు. అనంతరం వారు మృతదేహాన్ని, బైక్ ను చెరువులో పడేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్