కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. భగత్ సింగ్ నగర్ కాలనీలోని మూడు షాపులు, కొత్త బస్టాండ్ సమీపంలోని రెండు మొబైల్ షాపుల షట్టర్లను పగలగొట్టి దుండగులు భారీగా నగదు, వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.