తాడ్వాయిలో ద్విచక్ర వాహనాల ఢీ: యువకుడి మృతి

0చూసినవారు
తాడ్వాయిలో ద్విచక్ర వాహనాల ఢీ: యువకుడి మృతి
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనిల్ అనే యువకుడు మృతి చెందాడు. నందివాడ గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అనిల్‌తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనిల్ తన భార్యతో కలిసి వ్యవసాయ పనుల నిమిత్తం నందివాడకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.