శుక్రవారం నాగిరెడ్డిపేట్ మండలంలోని చీనూర్ గ్రామంలో మేకల అంజవ్వ (52) అనే మహిళ అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెంది వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గర్భాశయ క్యాన్సర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.