May 20, 2026, 10:05 IST/నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్
ప్రజా పాలన జిల్లా స్థాయి కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష*
May 20, 2026, 10:05 IST
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 22న నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ బుధవారం తన చాంబర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రజాపాలన కార్యక్రమాలను చక్కగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.