కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన దళిత యువకుడు బోరంచ మధు నేపాల్‌లో జరిగిన ఇంటర్నేషనల్ రన్నింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రథమ స్థానంలో నిలిచి ఛాంపియన్‌షిప్ సాధించాడు. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తితో విద్యాభ్యాసంతో పాటు పరుగు పందెంలో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. గ్రామానికి, దేశానికి పేరు తెచ్చిన మధును గ్రామ ప్రజలు,
కాంగ్రెస్ నేతలు రామాగౌడ్, గురుప్రతాప్ అభినందించారు.