May 09, 2026, 17:05 IST/
వివాహితతో సహజీవనం.. గదిలో విగతజీవిగా యువకుడు!
May 09, 2026, 17:05 IST
బెంగళూరులోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన తిప్పేస్వామి (28) అనే యువకుడు బెంగళూరులోని శ్రీగంధనగర్లో గల తన నివాసంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఒక గర్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే అతనికి, ఇన్స్టాగ్రామ్ ద్వారా దావణగెరెకు చెందిన ఒక వివాహితతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ గత కొంతకాలంగా ఇక్కడ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అయితే, శనివారం ఉదయం అతను విగతజీవిగా కనిపించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.