May 17, 2026, 03:05 IST/
మరోసారి పెరిగిన CNG ధరలు
May 17, 2026, 03:05 IST
దేశ రాజధాని ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు మరోసారి పెరిగాయి. తాజా సవరణ ప్రకారం కిలోకు రూ.1 పెంపు చేశారు. ఈ నిర్ణయంతో వారం రోజుల్లో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం (మే 15న) కిలో CNGపై రూ.2 పెంపు జరిగింది. దీంతో 48 గంటల్లోనే కిలోకు మొత్తం రూ. 3 పెంచడంతో సీఎన్జీ ఉపయోగించే వాహనదారులపై ప్రభావం పడనుంది. కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో CNG ధర కిలోకు రూ.80.09గా ఉండగా, నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో రూ.88.70కి చేరింది.