Mar 15, 2026, 05:03 IST/
వేరే యువతితో టీడీపీ నేత.. ఇంటికి తాళం వేసిన భార్య
Mar 15, 2026, 05:03 IST
AP: విశాఖ జిల్లా, కరక పాలమాంబ ఆలయ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుచరుడు మద్ది శ్రీనివాస్ వివాహేతర సంబంధం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన భార్యను కాదని మరో యువతితో సంబంధం పెట్టుకున్న మద్ది శ్రీనివాస్, పెద్ద వాల్తేర్లోని ఓ ఇంట్లో యువతితో ఉండగా ఆయన భార్య గదికి తాళం వేసింది. గతంలోనూ మద్ది శ్రీనివాస్ భార్య ఆందోళన వ్యక్తం చేయగా, ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అప్పట్లో తెలిపారు.