తప్పుడు ధ్రువపత్రాలతో కరెంట్ ఖాతాలు తెరిచి, వాటిని సైబర్ మోసగాళ్లకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో NZB, బోధన్, రెంజల్ ప్రాంతాలకు చెందిన మహ్మద్ సమీర్, రహీం అలీ, షేక్ అహ్మద్, షేక్ రహీం, మహమ్మద్ జమీల్ అహ్మద్, మహమ్మద్ అర్బాజ్, బొగుడమీది వీరేశం, అబ్దుల్ వాసిమ్, షేక్ సమీర్, ఇఫ్తెఖార్, అశోక్ తో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలు మధ్యవర్తుల ద్వారా జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.