దుబ్బాకలో 9వ పోషణ మాసోత్సవాలు

1చూసినవారు
9వ పోషణ మాసోత్సవాల్లో భాగంగా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని రైతు వేదికలో శనివారం పోషణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఫర్హాత్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ రాంబాబు, ఎంపీడీవో మారుతి, ఎంపీఓ మారుతి, సర్పంచ్ లు, సరోజిని దేవి, చెలిమెల శ్రీనివాస్, రావ్ జి, జ్యోతి గణేష్, వసంత రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్