తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఫార్మసీకళాశాలఏర్పాటుచేయాలి

0చూసినవారు
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఫార్మసీకళాశాలఏర్పాటుచేయాలి
తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్‌లో ప్రభుత్వ ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సెంట్రల్ లైబ్రరీ ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఏబీవీపీ యూనివర్సిటీ కార్యదర్శి సమీర్ మాట్లాడుతూ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఫార్మసీ కళాశాల లేకపోవడంతో వేలాది మంది BiPC విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. బీ. ఫార్మసీ చదవాలంటే 250-350 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.