ఘనంగా రాథోత్సవం

2చూసినవారు
ఘనంగా రాథోత్సవం
సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ గాడి మాకుల రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం ఫిబ్రవరి 1న ఘనంగా జరిగింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, పీసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ, యూత్ నాయకులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్