నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 12 ఏళ్ల బాలుడి అదృశ్యం మరియు హత్య కేసులో మంగళవారం నిజామాబాద్ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. 2024లో చిట్టాపూర్ గ్రామానికి చెందిన బండి నరేందర్, గణేశ్ విగ్రహాలు చూపిస్తానని నమ్మించి బాలుడిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు రుజువయ్యాయి. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితుడి కుటుంబానికి ఈ తీర్పు కొంత వరకు ఊరట కలిగించింది.