ధర్పల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో, మండల అధ్యక్షుడిగా,
కాంగ్రెస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన అంకం ఆనంద్ కుమార్ ను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొండ్యాల వినోద్, చిలుక నరేష్, కోశాధికారి అక్షయ్, కార్యదర్శి ఎల్దుర్తి వైభవ్, గంగాధర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.