రామాలయన్ని సందర్శించిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

1చూసినవారు
పెళ్లి రోజు సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దంపతులు డిచ్పల్లి ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం నాటి ఈ రామాలయం, దాని పక్కనే ఉన్న ఓంకారం ఆకారంలో ఉన్న చెరువు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే ఎంతో ఆకట్టుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు. చెరువు మరమ్మతులు, బోటింగ్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని సూచించారు. ఈ చెరువు అభివృద్ధి కోసం, రామాలయం పురోగతి కోసం ప్రభుత్వం నుండి కోటి రూపాయలు మంజూరు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్