నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా, ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపేందుకు సహాయపడే వాలంటరీలకు, బీఎల్ఓలకు తహసిల్దార్ శాంత గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ ఫారాల నింపే విధానం, అవసరమైన పత్రాల పరిశీలన, ఓటరు వివరాల నమోదు, చిరునామా మార్పులు వంటి అంశాలపై వివరించారు.