నిజామాబాద్: యువతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు

58చూసినవారు
నిజామాబాద్: యువతిని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు
మోపాల్ మండలంలోని ముదక్ పల్లికి చెందిన ఓమహిళను మోసం చేసిన అస్మత్ ఖాన్ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ శనివారం తెలిపారు. అస్మత్ ఖాన్, గ్రామానికి చెందిన సదరు యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అతడు పెళ్లి చేసుకుంటానని తెలపడంతో శారీరకంగా దగ్గరయ్యారు. చివరకు ఆమె గర్భం దాల్చడంతో మాటమార్చాడు. దీంతో బాధిత మహిళ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్