నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గణేష్ నిమజ్జనానికి, శోభయాత్రకు అధికారులు, గ్రామపంచాయతీ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, విలేజ్ కమిటీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, వార్డు మెంబర్ మమత రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు ముమ్మారం చేస్తున్నారు. శోభయాత్ర సాఫీగా సాగేందుకు రోడ్ల మరమ్మతులు, చెత్తాచెదారం గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయిస్తున్నారు. నిమజ్జనంకు చెరువు కట్ట వద్ద ప్రత్యేకంగా ఫోకస్ లైటింగ్ లను పూర్తి ఏర్పాట్లు చేశారు. గణపతి మండలి సభ్యులకు ఏలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.