
రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 12 మంది మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శివగంగ జిల్లాలో కంగేయం నుండి కరైకుడికి వెళ్తున్న ప్రభుత్వ బస్సు, కరైకుడి నుండి దిండిగల్ వెళ్తున్న మరో ప్రభుత్వ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో చోటుచేసుకుంది.




