
కాలుజారి కిందపడి పోయిన పాక్ డిప్యూటీ సీఎం (వీడియో)
పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లో జరిగిన నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో కాలు జారి కిందపడిపోయారు. ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో, ఈజిప్ట్ మంత్రిని ఆహ్వానించే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.




