ధర్పల్లి: గణేష్ మండపం వద్ద ఎమ్మార్వో పూజలు

537చూసినవారు
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో పవర్ యూత్ గణేష్ మండపం వద్ద గణనాథుని రాధాకృష్ణని రూపంలో అలంకరించి ఉన్న మండపాన్ని ఎమ్మార్వో టి. శాంత సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి, పూలమాలవేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెలిమిల శ్రీనివాస్, వి డి సి చైర్మన్ ఆర్మూర్ రంజిత్, వార్డు మెంబర్ మమత రాజ్ కుమార్, పవర్ యూత్ సభ్యులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్