ధర్పల్లి మండల కేంద్రంలో జిల్లాస్థాయి బంజారాల హోలీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బంజారాల జాతీయ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ, బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సేవాలాల్ మహారాజ్, జగదాంబ మాత ఆశీస్సులతో బంజారాలు ఎక్కడ ఉన్నా సుఖసంపదలతో వర్ధిల్లుతారని తెలిపారు. ఈ పండుగ బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, ఐక్యతను చాటింది.